విజయ్ పార్టీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడులో స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీని ప్రకటించిన సందర్భంలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని అధికారికంగా ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు సిద్దులు, సాధువుల పుణ్యభూమి అని, అక్కడ రాజకీయ యాత్రను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆదివారం విజయ్ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీనితో తమిళ రాజకీయాలలో ఈ పార్టీ ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని రాజకీయ వేత్తలు అంచనాలు వేస్తున్నారు. డీఎంకే పార్టీకి అండగా ఉన్న దళిత, క్రిస్టియన్ల ఓట్లు విజయ్ పార్టీకి మార్పు చెందవచ్చని భావిస్తున్నారు.