CI అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేయనున్న పవన్ కళ్యాణ్
తిరుపతి శ్రీకాళహస్తీలో నిరసనలు చేపడుతున్న జనసేన నాయకుడు సాయిపై CI అంజూ యాదవ్ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా జనసేన నాయకుడిపై CI అంజూ యాదవ్ వ్యవహరించిన తీరును ఖండిస్తూ..ఇవాళ తిరుపతిలో ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.అయితే ఇక్కడి నుంచి హైవే మీదుగా రేణిగుంట జంక్షన్, గాజులమండ్యం, మహిళా యూనివర్శిటీ రోడ్డు, వెస్ట్ చర్చి, బాలాజీ కాలనీ సర్కిల్ నుంచి టౌన్ క్లబ్ వద్దకు నేతలు,కార్యకర్తలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం శ్రీకాళహస్తీలో జనసేన నాయకుడి సాయిపై దాడి చేసిన CI అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి పవన్ కళ్యాణ్ వినతిపత్రం ఇవ్వనున్నారు.