Home Page SliderNational

‘పవన్ భారీసాయం’.. ఎన్నికోట్లో తెలుసా?

తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు రూ.కోటి చొప్పున ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన సహాయాన్ని మరింత విస్తరించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చొరొక కోటి రూపాయలతో పాటు, ఏపీలోని గ్రామ పంచాయితీలకు కూడా సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. 400 పంచాయితీలు ఉన్న ఏపీకి ప్రతీ పంచాయితీకి రూ.లక్ష చొప్పున్న 400 లక్షల రూపాయలు అంటే 4 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. నేడు పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో ఈ విరాళాన్ని ప్రకటించారు పవన్.