హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు
హైద్రాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని విస్తరిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.దీని పరిధిలోకి మరో 4 జిల్లాలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఆయా జిల్లాల పరిధిలోని 16 మండలాలను కొత్తగా చేర్చింది.మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.వీటిని చేర్చడం ద్వారా కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలోకి 3 వేల చ.కి. భూభాగం చేరుతుందని అంచనా వేశారు.దీని ద్వారా హైద్రాబాద్ ఆదాయ వనరులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1,350 గ్రామాలు చేరినట్లైంది.