ఉద్యోగులకు ఓలా షాకింగ్ న్యూస్
ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకిచ్చింది. 500 మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించింది. పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో, వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లేఆఫ్ ప్రకటించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే వెహికిల్స్ సర్వీస్ విషయంలో ఓలా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం. జూలై నుంచే తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేఆఫ్ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నాయి.