అమ్మో పులి
ఇందుగలడందు లేడని సందేహంబు వలదు…ఎందెందు వెతికినా అందుండు నా నారసింహుడు అన్నట్లుగా పెద్దపులి సంచరిస్తుంది.అడవుల్లో ఉండాల్సిన పులులు జనారణ్యంలోకి వస్తున్నాయంటే వాటి మనుగడకు భంగం కలిగిందనే భావించాలి.ఈ దిశగా ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు సమగ్ర చర్యలు చేపట్టకపోవడంతో పులులు అడవుల వెలుపల సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో మూడు పులులు భయపెడుతుండగా తాజాగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు పరిసర గ్రామస్థులు గుర్తించారు.దీంతో వ్యవసాయ కూలీలు,పశువుల కాపరులు బెంబేలెత్తుతున్నారు.దీని గురించి అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు.ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.