హైవేపై అశ్లీల నృత్యాలు.. బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ హైవే పై మహిళా స్నేహితుడితో కలిసి అశ్లీల చర్యలు, నృత్యాలు చేసిన బీజేపీ నాయకుడు కటకటాల పాలయ్యారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత మనోహర్ ధకాడ్ కు సంబంధించిన రెండు వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో అతను ఒక మహిళతో అనుచితమైన స్థితిలో కనిపించగా, మరొక వీడియోలో అతను ఆమెతో ఎక్స్ ప్రెస్ హైవేపై డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. మే 23 రాత్రి, పోలీసులు బని గ్రామంలోని ధకాడ్ ఇంటిపై దాడి చేయగా.. ఆయన అందుబాటులో లేరు.. దీంతో అతని కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.