Breaking NewsHome Page SliderNational

యాపిల్ సంస్థకు నోటీసులు

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్‌కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సోషల్ మీడియాలో తెలియజేశారు. ఐ ఫోన్‌లలోని ఐఓఎస్ 18 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లోపాలకు సంబంధించి వినియాగదారుల నుండి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన తర్వాత అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. దీనిపై యాపిల్ సంస్థ వివరణ ఇచ్చిన తర్వాత పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.