ఇక నుంచి ఆర్టీఏ ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు
కొత్త వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సు వంటివి పొందాలంటే ఇక మీదట రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం కొత్త విధానం అమలు చేయనుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్‌లతో అనుసంధానమయింది. దీంతో మార్చి మొదటి వారం నుచి ఆన్‌లైన్‌లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.తొలి విడతలో సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ఈ సేవలను అందించనున్నారు. ‘వాహన్’, ‘సారధి’ పోర్టల్‌లు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచారాన్ని అనుసంధానం చేసి బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్ ద్వారా సాఫీగా సాగనుంది.ఈ విధానం ప్రస్తుతం సికింద్రాబాద్ కార్యాలయంలో మాత్రమే అమలు చేస్తున్నారు. ఆ తరువాత ఇతర జిల్లాలకు అనుసంధానం చేయనున్నారు.

