నారాయణ.. నారాయణ.. పాపం ఏడో తరగతి విద్యార్ధి !
నారాయణ అంటేనే ఆత్మహత్యలు…ఆత్మహత్యలంటేనే నారాయణ అనుకునే విధంగా తయారయ్యాయి నారాయణ విద్యాసంస్థలు.తాజా గా మరో ప్రాణం గాలిలో కలిసి పోయింది.హైద్రాబాద్‌లోని హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్ధి ఒత్తిడి చదువులు భరించలేక ఉసురు తీసుకున్నాడు.స్కూల్ హస్టల్ రూంలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన విద్యార్ధులు ఉపాధ్యాయులకు చెప్పడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.ఈనెల 16న ఉదయం తర్వాత ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయాన్ని మంగళవారం తెలిపారు.దీంతో సమాచారం అందుకున్న తండ్రి క్యాంపస్ దగ్గర బంధువులతో ఆందోళనకు దిగాడు.తన కుమారుణ్ని చదువు విషయంతో ఒత్తిడి చేయొద్దని తాను ఉపాధ్యాయులకు,యాజమాన్యానికి ఎన్నో సార్లు చెప్పినా వినలేదని,అసలు ఇది ఆత్మహత్య లేక హత్యో తేల్చాలని ఆయన డిమాండ్ చేశాడు.

