మస్క్‌కు ఆఫీస్‌పై ట్రంప్ క్లారిటీ..
అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సారథిగా ఎలాన్ మస్క్‌ను అధ్యక్షుడు ట్రంప్ నియమించిన సంగతి తెలిసిందే. అందుకే టెస్లా అధినేత మస్క్‌కు వైట్‌హౌస్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలను తాజాగా ట్రంప్ ఖండించారు. మస్క్‌కు ఆపీసును ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అది వైట్‌హౌస్‌లో కాదని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్ష భవనంలోని పశ్చిమ భాగంలో ఏర్పాటు చేస్తున్న ఆఫీస్ ప్రభుత్వానికి చెందిన వివిధ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అమలు, సలహాలు, వంటి విషయాలు చర్చించేందుకు ఈ ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఆఫీస్ ద్వారా ప్రభుత్వ శాఖలలో వృథా ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.


 
							 
							