మోక్షజ్ఞ హీరోయిన్ ఖుషీ కపూర్‌తో సినిమా?
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా సినిమా రాబోతోందని.. అలాగే, ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతోందని టాక్. ఇప్పుడు ఈ క్రేజీ సినిమా గురించి అదిరిపోయే రూమర్స్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి ‘దివంగత శ్రీదేవి’ 2వ కూతురు నటించబోతోందని ఆ రూమర్ సారాంశం. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ని ఈ చిత్రంలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మోక్షజ్ఞ జోడీగా ఖుషీ కపూర్ అయితే అటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాకి క్రేజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అయితే నందమూరి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజే. మరోవైపు ఖుషీ కపూర్ అక్క ‘జాన్వీ కపూర్’ `దేవర`తో టాలీవుడ్‌లో లాంచ్ అవుతుంది. ఇప్పుడు చెల్లి వంతు వచ్చింది. విశేషం ఏమిటంటే.. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు నందమూరి వారసులతోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం. అన్నట్టు ఖుషీ కపూర్ ఎంట్రీపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా పౌరాణికం రిఫరెన్స్‌తో జరిగితే ఫ్యాన్స్‌కి అది పెద్ద పండగే. ఐతే, ప్రశాంత్ వర్మ నుంచి ఈ మూవీకి సంబంధించి ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

