ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం
రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన పక్షపాతిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తెలిపింది. దీనికి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి 50 మంది ఎంపీల మద్దతు కావలసి ఉండగా, 70 మంది ఎంపీలు సంతకాలు చేశారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మరోపక్క లోక్‌సభలో విపక్షాల నిరసనలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మనం సభా గౌరవాన్ని, మర్యాదను కాపాడుతూ ప్రజల ఆశలు నెరవేర్చాలని పేర్కొన్నారు. దీనితో ఉభయ సభలు రెండూ రేపటికి వాయిదా పడ్డాయి.

