Home Page SliderTelangana

బొట్టు ఉంటేనే దాండియాలో ఎంట్రీ ..

విజయదశమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే దాండియా కార్యక్రమాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాండియా కార్యక్రమాలకు బొట్టు లేకుండా వచ్చే వారిని అనుమతించకూడదని నిర్వాహకులకు సూచించారు. దాండియాలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని, అయితే ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల దాండియాకు అనుమతిచ్చే ముందు తప్పనిసరిగా పత్రాలు పరిశీలించాలని కోరారు. అలాగే లోపలికి వెళ్లాక దుర్గాదేవిని దర్శించుకుని, నుదుటిపై మందపాటి తిలకం పెట్టుకున్న తర్వాతే దాండియాకు అనుమతివ్వాలన్నారు.