Home Page SliderTelangana

కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే జంప్

బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరి,  తిరిగి సొంతగూటికి చేరుకున్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌ను వీడి, కాంగ్రెస్‌లో చేరారు కృష్ణమోహన్. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే మళ్లీ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలంతా రెండవ విడత రుణమాఫీ కార్యక్రమంలో ఉండగా ఈ సంఘటన జరిగింది. దీనితో తిరిగి బీఆర్‌ఎస్‌కు కాస్త బలం పెరిగినట్లయ్యింది.