మంత్రి సీతక్క కీలక కామెంట్
మహిళల భద్రత, రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఎన్నికలు పాలనకు కొంత అడ్డంకిగా మారాయని అన్నారు. ఇప్పుడే పాలన కొంత పరుగులు తీస్తోందని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారితో మహిళల మీద దాడులు పెరిగాయని, వీటిని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు.

