Home Page SliderInternationalTrending TodayVideos

వైరల్ అవుతున్న మిలియనీర్ ‘యాంటీ ఏజింగ్’ ప్రయోగాలు

కాలం గడిచే కొద్దీ వయసు పెరగడం ఎంతటి వారికైనా సహజమే. కానీ ఈ విషయాన్ని ఒప్పుకోకుండా రకరకాల ప్రయోగాలతో అతి చేస్తుంటారు కొందరు. ఆరోగ్య స్పృహ ఉండడం మంచిదే కానీ మితిమీరిన పోకడలకు పోకూడదు. అమెరికా మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో కోట్లకొలది సొమ్మును ధార పోస్తున్నారు. గతంలో కూడా తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం, ప్లాస్మా ప్రయోగాలు వంటి పిచ్చి చర్యలతో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఇటీవల వృద్ధాప్యాన్ని దూరం చేయడానికి తన కార్యాలయాన్నే హైపర్ బారిక్ ఆక్సిజన్ చాంబర్‌గా మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన నోరు, ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ ధరించి ఆక్సిజన్ చాంబర్ లోపల కంప్యూటర్‌లో పని చేస్తున్నారు. ఈ థెరపీ ద్వారా గదిలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని పీల్చుకునే వైద్య చికిత్స అని పేర్కొన్నారు. దీనివల్ల కణజాలాలలో సెల్యులార్, వాస్కులరైజేషన్‌కి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వీడియోలు వైరల్ అవడంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. వాస్తవాన్ని అంగీకరించాలంటూ సెటైర్లు వేస్తున్నారు.