Home Page SliderNationalNewsNews AlertTrending Today

టీఎంసీకి గుడ్‌బై చెప్పిన మదన్ మిత్రా

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కామర్‌హాతి ఎమ్మెల్యే మదన్ మిత్రా టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన, “టీఎంసీ ఇప్పుడు ముక్కలైంది” అంటూ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను టీఎంసీలోనే కొనసాగుతానని గతంలో చెప్పినా, ప్రస్తుతం అసెంబ్లీలో తన గదిని మార్చుకున్నట్లు వెల్లడించారు.

ఇటీవల టీఎంసీని పలువురు నేతలు వీడుతున్న నేపథ్యంలో, మదన్ మిత్రా కూడా పార్టీకి దూరమై రెబల్స్ వర్గంలో చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన నిర్ణయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.