ప్రధాని మోదీకి లోక్‌మాన్య తిలక్ అవార్డ్
మహారాష్ట్రలోని పూణెలో లో ప్రధాని మోదీకి లోక్‌మాన్య తిలక్ అవార్డు లభించింది. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నుండి ఈ అవార్డును అందుకున్నారు. వీరిద్దరు ఒకే వేదికపై కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మోదీ రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక ఇతర అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మోదీ ప్రకటించారు. తమ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాన్ని, నైపుణ్యాలను పెంచడానికి స్థిరనిశ్చయంతో ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే, యధావిధిగా నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. లోకమాన్య తిలక్ అవార్డు అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వాతంత్య్ర ఉద్యమ దశను మార్చారని మోదీ ప్రశంసించారు. ఆయన ప్రతిభావంతులైన యువతను గుర్తించే గొప్ప టాలెంట్‌ను కలిగి ఉన్నరని , వీర్ సావర్కార్‌ను కూడా ఆయనే గుర్తించారని మోదీ పేర్కొన్నారు. ఈ అవార్డుకు వచ్చే బహుమతి మొత్తాన్ని ‘నమామి గంగే’ అనే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ విరాళంగా అందజేశారు.

