నీళ్ల కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుదాం
సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు హరీష్ రావు. ఆ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా కాంగ్రెస్ తో పోరాడుదామని చెప్పారు. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తు కార్యాచరణ చేపడుదామని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో హరీష్ రావు సమావేశంలో చర్చించారు.

