సమంతతో సినిమా తీస్తా..లేడీ డైరక్టర్
‘సమంతకు నేను అభిమానిని ఐదేళ్లుగా ఆమెను దగ్గర నుండి చూస్తున్నాను. ఆమె బాధపడితే నాకు కన్నీళ్లు వస్తాయి. సమంతను చూసి ఎంతోమంది అమ్మాయిలు ధైర్యం తెచ్చుకోవాలి’ అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు దర్శకురాలు సుధా కొంగర. ఆమెతో సినిమా తీయాలని గతంలో రెండుసార్లు ప్రయత్నించానని, కానీ కుదరలేదని ఎప్పటికైనా సమంతతో యాక్షన్ సినిమా తీస్తానని పేర్కొన్నారు. ఇటీవల కోలీవుడ్‌లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ పురస్కారాలలో సమంత గోల్డెన్ క్వీన్‌గా అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకొంగర మాట్లాడారు.

