కాకరేపుతున్న కేటిఆర్ ట్వీట్
‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది.కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగాయించి ఎదురొడ్డుతుంది.మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది.పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది.కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ గరమైతుంది’ అంటూ కేటిఆర్ మంగళవారం ట్వీట్ చేశాడు.సోమవారం కేంద్ర మంత్రులను కలవడానికి కేటిఆర్ వెళ్తే పొన్నం లాంటి మంత్రులు ..కేసుల భయంతో కాళ్లబేరానికి వెళ్లాడంటూ ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో లగచర్ల ఫార్మా రగడ ఘటన దృష్ట్యా మళ్లీ కేటిఆర్ ఇలా నిర్భయంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

