Andhra PradeshHome Page Slider

కోడికత్తి ఘటన సింపతీ కోసం కాదు: బొత్స

సీఎం జగన్‌పై 2017లో శ్రీనివాస్ అనే  వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగాను,రాష్ట్రవ్యాప్తంగాను తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో అప్పుడే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణ  ఇప్పటివరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నిందితుడు మాత్రం తాను జగన్ సీఎం కావాలనే ఇలా చేశానని వెల్లడించినట్లు పలు వార్తా పత్రికలు ప్రచురించాయి. దీంతో ప్రతిపక్షాలు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డాయి. ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం జగన్ ఆడిన నాటకమని రుజువైందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. కోడికత్తితో సీఎం జగన్ కావాలనే దాడి చేయించుకున్నారని వార్తా సంస్థలు వక్రీకరించడంతో ఏపీలోని ప్రతిపక్షాలు అధికార పక్షంపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయన్నారు. అయితే ఈ కోడికత్తి ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే YCP డిమాండ్ అన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రభుత్వం పోరాడుతుందన్నారు. ప్రైవేటీకరణ ఆగడానికి కారణం BRS పార్టీ అనడం వాస్తవం కాదన్నారు. దీనిపై ఏపీలో జనసేన, BRS పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.