కిలాడీ పెళ్లికూతురు స్కెచ్..బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
యూపీలో ఒక కిలాడీ నిత్య పెళ్లికూతురు భారీ స్కెచ్ వేసింది. ఆమె వెనుక బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మతి పోతుంది. ప్రేమ, పెళ్లి పేరిట ఘరనా మోసాలకు పాల్పడే ఈ సిండికేట్‌లో పెళ్లి కూతురు, తల్లి, ఇద్దరు మధ్యవర్తులు కూడా ఉన్నారు. యూపీలో బండాకు చెందిన పూనమ్ వధువుగా, సంజనా గుప్తా అనే మహిళ తల్లిగా, విమలేశ్ వర్మ, ధర్మేంద్ర అనే వ్యక్తులు నలుగురూ ముఠా ఏర్పడ్డారు. ఒంటరి బ్రహ్మచారుల వేటలో ఉన్న మధ్యవర్తులు వారిని కనిపెట్టి వారు ప్లాన్ అమలు చేస్తారు. వీరిద్దరూ ఫీజుగా పెళ్లికొడుకు వద్ద రూ.1.5 లక్షలు ఫీజు తీసుకుంటారు. అనంతరం పూనమ్‌తో పెళ్లి జరిపిస్తారు. పెళ్లి జరిగాక ఆమె సమయం కోసం ఎదురుచూసి, ఇంట్లో డబ్బు, బంగారం తీసుకుని పారిపోయేది. ఇలా ఆరుగురిని మోసం చేసి, ఏడవ పెళ్లి చేయాలనుకునే సమయంలో శంకర్ అనే వ్యక్తి వారికి దొరికారు. అయితే శంకర్‌కు వీరి వైఖరిపై అనుమానం కలిగి, పూనమ్, సంజనల ఆధార్ కార్డులు చూపించాలని అడిగారు. దీనితో వారు శంకర్‌ను అబద్దపు కేసులో ఇరికిస్తామని బెదిరించారు. అయితే శంకర్ వారికి తెలియకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వీరి రాకెట్ మొత్తం బయటపడింది. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.