crimeHome Page SliderInternationalSpiritual

హిందూ ఆలయంపై ఖలిస్థానీల దాడి..

కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులు దారుణానికి పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలతో కెనడాలోని సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం వద్ద వీరంగం సృష్టించారు. శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించి స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ రాతలు రాశారు. వాటిని ధ్వంసం చేశారు. ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ కెమెరాలను దొంగలించారని అర్చకులు పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని, ఈ ఘటన వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఆలయం వద్ద భద్రతా దళాలు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.