‘కేసీఆర్ ఐఫోన్..నువ్వు చైనా ఫోన్’ కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. గత ప్రభుత్వంలో కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉండేదన్నారు. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లాంటిదని చూడడానికే కానీ, పని చేయడానికి పనికిరాదన్నారు. నేడు జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుల గణన లెక్కలపై విమర్శలు కురిపించారు. కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. బీసీల ఓట్లు మాయమాటలతో వేయించుకుని వారినే బురిడీ కొట్టిస్తున్నారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో మాట్లాడడం లేదు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు చెప్పడం లేదు. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపారు. మరో తెలంగాణ పోరాటం తరహాలో బీసీ ఉద్యమం చేయాలి. అంటూ మండిపడ్డారు.

