Home Page SliderTelangana

వంద రోజుల్లో కేసీఆర్ సర్కారు ఇంటికి పోతుంది-రాహుల్ గాంధీ

కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజల సొమ్మును లూటీ చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, ధరణి పోర్టల్ స్కాంలో సామాన్యుల భూములు లాక్కున్నారని రాహుల్ విమర్శించారు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు వల్ల పెద్ద పెద్ద భూయజమానులు మాత్రమే లబ్ధి పొందారన్నారు. కేసీఆర్ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీకయ్యాయని, 2 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. అందుకే కేసీఆర్ సర్కారును సాగనంపాలని పిలుపునిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ BRS ను ‘BJP బీ టీమ్ అని పిలుస్తున్నామన్నారు. తెలంగాణ వల్ల కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఇక్కడి పేదలు, రైతులు, కూలీల కోసమన్నారు. 9 ఏళ్లలో పేదలు, రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు, యువత, కూలీలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు రాహుల్ గాంధీ. 100 రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి పోతుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉందన్న రాహుల్… అధికారంలోకి వస్తే.. కర్నాటకలో ఇస్తున్నట్టుగా తెలంగాణలో పేద ప్రజలకు పథకాలు అందిస్తామన్నారు.