Home Page SliderTelangana

కోర్టు బయట నోరు విప్పిన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇవాళ బెయిల్ పిటిషన్ సందర్భంగా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె జైలుకు వెళ్తున్న సమయంలో ఒక వ్యాఖ్య చేశారు. కర్నాటకలో సంచలనం సృష్టించిన కేసు విషయంలో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీని దేశ దాటించి, తమలాంటి వారిని అరెస్ట్ చేశారని, ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. దేశంలో అసలేం జరుగుతుందన్నది అందరూ గమనించాలన్నారు. రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 15, శుక్రవారం అరెస్టు చేసింది.