జర్నలిస్టువా? బ్రోకర్ వా?
- రోతపుట్టించే వికృత రాతలు…..
- స్క్రాప్ న్యూస్ – నకిలీ ఐడీలు …
- అవినీతి భాగోతాల చిట్టా…
- కొత్తగా కడుతున్న బిల్డింగ్ కనబడితే చాలు…
- అధికార పార్టీ పేరు చెప్పుకొని…
- మెట్టుగూడ భూమిపై కథనాలలో వాస్తవమెంత?
జర్నలిస్ట్ ముసుగులో ఆర్ ఎస్ ఐ అనుమతి లేని అక్రమ పత్రిక స్వేచ్చను అడ్డుపెట్టుకుని వికృత రాతలకు కేంద్రంగా మారాడు. అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకుని మకిలి రాతలకు తెరలేపాడు. చవకబారు రాతగాదు పైసల్ కోసమే బ్లాక్ మెయిలింగ్ జర్మలిజం చేస్తూ దందాలకు పాల్పడుతున్నాడు. అందిన కాడికి దోపిడీ చేస్తూ పైసా వసూలే పరమావధిగా పెట్టుకున్నాడు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు అవినీతి చిట్టా చాంతాడంతా తన వెకిలి రాతలతో సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు. స్వేచ్ఛ పేరుతో ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడు. జర్నలిజం విలువలు మంటకలుపుతూ దిగజారుడు వార్తలు ప్రచురిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. సమాజానికి మూల స్తంభమైన జర్మవిజం పరువును ప్రజల్లో నవ్వుల పాలు చేస్తున్నాడు. పత్రికా స్వేచ్ఛ స్థానంలో బెదిరించే స్వేచ్ఛ చేరిందని చెప్పటంలో ఈ నకిలీ రాతగాడు నంది పలికాడు. సమాజంలోని పేరు, ప్రతిష్ట, డబ్బు కలిగిన వ్యక్తులు- సంస్థలను టార్గెట్ చేస్తూ ప్రతిరోజూ ఒక అసత్య కథనాన్ని వండి వారుతున్నాడు. ప్రభుత్వ అధికారులను పోలీసులను టార్గెట్ చేసి వ్రాయడం తద్వారా ప్రైవేట్ వ్యక్తులపై ఒత్తిడి పెంచి వసులు: చేయటం ఇతగాడి దినచర్య. ఇతని రాతలకు తలొగ్గి రాజీ చేసుకోకపోతే అదే వార్త ఇతర ప్రసార సాధనాల్లో ప్రసారమవుతుంది. తనకు తాను అధికారంలో ఉన్న వారికి అత్యంత దగ్గరగా చెప్పుకునే ఈ చీటర్ పట్ల ప్రభుత్వం పోలీసు అధికారులు కళ్లు తెరవకపోతే భవిష్యత్తులో అనేక అనర్ధాలు జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రోతపుట్టించే వికృత రాతలు…..
ప్రతి రంగంపై నకిలీ రాతలు రాస్తూ బెదిరిస్తున్న తీరుపై బాధితులు సమూహంగా ఏర్పడి కన్నెర్ర చేసేందకు ప్రక్కా ప్రణాళిక రూపొందించారు. జర్నలిజాన్ని భోగిమంటలు వేసుకుని చలి కాగుతున్న ఈ బజారు రోతగాడిపై బాధితులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తన ఇష్టారాజ్యంగా రాతలు రాసుకుంటూ ఎంతో కొంత రాకపోదా అనే రీతిలో ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా మరకలు అంటించడమే ఈ కుహనా జర్నలిస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. సామాన్యులు ముక్కున వేలేసుకునే విధంగా జర్నలిజాన్ని అడ్డదారులు తొక్కిస్తున్న తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు చందంగా తయారయ్యాడు. దేవేందరా ఇదేమి దరిద్రం అంటూ బాధితులు వాపోతున్నారు

స్క్రాప్ న్యూస్ – నకిలీ ఐడీలు …
లైసెన్సు లేకపోయినా స్వేచ్చగా బ్లాక్ మెయిలింగ్ రాతలు రాస్తున్న వైనంపై పలువురు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్రమంగా పత్రిక నడపుతూ అనుమతి లేని ఐడి కార్డులిచ్చి దందాలకు దిగటం పరిపాటిగా మారింది. ఐడీ కార్డులతో క్యాష్ చేసుకుంటూ బడ్డీ కొట్లు, మాంసం, చేపల మార్కెట్లు, ఇతర స్టాల్స్, రేషన్ మిల్లులు, నూనె దుకాణాలు వద్ద ఆయా కార్డులు చూపుతూ బెదిరింపులకు దిగి చిన్నవ్యాపారులను కూడా వదలకుండా వసూళ్లు పర్వం సాగిస్తున్నారు. నిజమైన అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చి వార్తలు ప్రచురించి వాటి పరిష్కారానికి మార్గం చూపితే ఎవరూ కాదనరు. స్క్రాప్ వార్తలు రాసి నిజమనే పరిస్థితి తీసుకువచ్చే క్రమంలో తప్పటడుగులు వేస్తూ కాసులకు కక్కుర్తి పడుతున్నాడు
అవినీతి భాగోతాల చిట్టా…
నేను ఏది రాసినా.. నాకేవ్వరు సాటి అనే రీతిలో చింతకుంట్ల దేవేందర్ రెడ్డి అనే వికృత రాతల జర్నలిస్ట్ వ్యవహార తీరు విస్మయపరుస్తోంది. లేని దాన్ని ఉన్నట్టుగా రాయడంలో సిద్ధహస్తుడు. రియల్ ఎస్టేట్, కొత్తగా ఇంటి నిర్మాణాలు చేపట్టే యాజమానులు ఎవ్వరి దగ్గరి నుంచైనా వసూళ్లు చేయాల్సిందే. ఇదే టార్గెట్ గా చేసుకుని మూడు రాతలు ఆరు దందాలు చేస్తూ అడ్డు అదుపు లేకుండా జర్నలిజాన్ని సాగిస్తున్నాడు. అనైతిక కధనాలు సృష్టిస్తూ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నవాళ్లకు రోత పుట్టిస్తున్నాడు. తప్పుడు కధనాల ప్రచురించి కక్కిన కూడు తిని కడుపు నింపుకుంటున్నాడు. చివరికి విద్య నందించే ప్రైవేట్ స్కూల్స్ దగ్గర నుంచి మాల్స్ వరకు ఏదో నెపంతో వసూళ్ల రాజాగా ఆ ప్రాంతంలో పేరు గడిస్తూ సంపాదిస్తున్నాడు. మ్యాటర్ రాస్తే మనీ పడాల్సిందేనంటూ నయానా భయానా పంచాయితీలు నడిపిస్తున్నాడు. కాసులు విసిరితే గాని కధనాలు రాయకుండా కనికరం చూపిస్తాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ పోర్టల్ తో వాట్సాప్ ఫార్వార్డ్ లు చేస్తూ బెదిరింపుల పర్వం స్వేచ్ఛగా కొనసాగిస్తున్నాడు.

కొత్తగా కడుతున్న బిల్డింగ్ కనబడితే చాలు…
సికింద్రాబాద్ ప్రాంతంలో చిలకలగూడ, సీతాఫల్ మండీ, మెట్టుగూడ పరిసర ప్రాంతాల పరిధిలో పలువురు బిల్డర్ల దగ్గర డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేధింపులకు గురిచేస్తుండడంతో ఎవ్వరికి వారు మనకెందుకులే అనే కోణంలో ఫిర్యాదు చేసేందుకు వెనకాడామని, నిర్మాణంలో ఉన్న వాటిని ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేయ్యడం ఇదే తంతును సాగిస్తున్నాడని ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేక డబ్బులు ఇస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. సికింద్రాబాద్ లో మాయరాత గాళ్లతో నరకం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ పేరు చెప్పుకొని…
ఆర్ఎన్ఐ లేని అక్రమ ‘స్వేచ్ఛ’ పత్రికలో మాయరాతలు రాస్తూ.. కమిషన్ల కక్కుర్తికి అలవాటుపడ్డాడు. తోకతోడుతో యధేచ్ఛగా జర్నలిజం మాఫియా నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ మహానగరంలో మాయగాడు చేసే అక్రమాలు, అవినీతి, పంచాయితీల చిట్టా, వసూళ్లు దందాలన్ని ఒక్కోక్కటిగా బయటకొస్తున్నాయి. తన వెనకున్న ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పుకుంటూ… మాముళ్ల మత్తులో జోగుతున్నాడు. ఖాళీ ప్లాట్లు కనబడితే గ్రద్దలా వాలిపోతాడు. అదే విధంగా కొత్త ఇంటి నిర్మాణాలు చేపడితే ఇంటి యాజమానులు పీక్కుతింటాడు. డబ్బులు ఇవ్వందే కదలడు.. వదలడు. అనేక మంది ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలను అసత్య కధనాలు రాసి వసూళ్ల పర్వానికి తెరలేపుతాడు. ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇంటల్జెన్స్ అధికారులకు తెలియడంతో నష్ట నివారణ చర్యల కోసం సమాజంలో మంచి పేరు ఉన్న జర్నలిస్టులను కూడా ఈ రొంపిలోనికి లాగుతున్నాడు.

మెట్టుగూడ భూమిపై కథనాలలో వాస్తవమెంత?
- బ్లాక్ మెయిలర్ దేవేందర్ రెడ్డికి తోడైన చీటర్ వీరభద్రారెడ్డి
- ఇరువురు కలిసి చెరొక కోటి రూపాయలకు టెండర్
- కొనుగోలుదారులపై కేసుపెట్టించి ఆనక పోలీసులపై నిందలు
- పెద్దలంతా ఛీ కొట్టాక తోక పత్రికను ఆశ్రయించిన వైనం

తమ తండ్రికి ఉపాధి కల్పించి తాము నివసించడానికి అవకాశం కల్పించిన తమది కాని ఫ్యాక్టరీ జోలికి వెళ్లొద్దని తోడబుట్టిన ప్రభాకర్ రావు, సుధాకర్ రావు ఇద్దరు తమ తమ్ముడు రమేశ్ కు ఎన్నిసార్లు చెప్పినా ఛీటర్ వీర భద్రారెడ్డి సహవాస దోషంతో ఫ్యాక్టరీ స్థలానికి ఎసరు పెట్టి 2025 మార్చి నెలలో శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి భూమిని డెవలప్ మెంట్ కు ఇవ్వాలని ప్రయత్నించిన విషయం తెలిసి కొనుగోలుదారులైన మల్లెంపాటి శ్రీధర్ మరియు షేక్ మస్తాన్ లు పిలిచి అడగగా 15 కోట్ల రూపాయలు డిమాండ్.. చేసి దానికి ఒప్పుకోకపోవడంతో ఫ్యాక్టరీ స్థలంలో ఉన్న పాత బిల్డింగ్లను కూల్చివేశారు కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యాక కొద్ది కాలానికి స్టే తెచ్చుకుని తిరిగి కొనుగోలుదారులపై కేసు పెట్టిన చరిత్ర వీర భద్రారెడ్డి, రమేశ్ లది పోలీసు అధికారులు పలుమార్లు శాంతియుతంగా, చట్ట బద్దంగా పరిష్కరించుకోవాలని కోరినా వారి వ్యక్తిత్వా లను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల పై ఆసత్య ఆరోపణలు చేస్తే వారు భయపడి పోయి తమ కబ్జాకు సహకరిస్తారనే ఆలోచన వీర భద్రారెడ్డి, రమేశ్, జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డిలకు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని పలుమార్లు పిలిచి పది రోజులపాటు కాలక్షేపం చేసి సమయంలో హైకోర్టు స్టే తెచ్చుకోవడం, కొనుగోలుదారు లపై స్థానిక కోర్టులలో కేవియట్ దాఖలు చేయడం పోలీస్ అధికారులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం. క్రింది స్థాయి పోలీస్ సిబ్బం దిపై ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయడం వంటి జిత్తులు మారి పనులు చేసి చివరిరి మీడియాలో అసత్య ఆరోపణలు చేసి తమ పబ్బం గడుపుకోవాలనే దురాలోచనకు ఈ దొంగల ముఠా వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కొనుగోలుదారులైన మల్లెంపాటి శ్రీధర్ మరియు షేక్ మస్తాన్ లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేస్తే తిరిగి అదే పోలీసులు కొనుగోలుదారులకు సహకరిస్తున్నారని ఆరోపణ చేయటం కేవలం పోలీస్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి మాత్రమే.

