జానీ మాస్టర్‌ను ప్రేమ పేరుతో వలలో వేసుకుంది: భార్య సుమలత
జానీ మాస్టర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. జానీ మాస్టర్‌ను కావాలని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పలు రకాల వేధింపులకు పాల్పడింది అని భార్య సుమలత లేడీ డ్యాన్సర్‌పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయటం కోసం నా భర్త దగ్గరకు వచ్చి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందంటూ సుమలత ఆరోపించింది. ఆ లేడీ డ్యాన్సర్ ఐదేళ్లుగా తనను మానసికంగా కృంగిపోయేలా చేసిందంటూ వాపోయింది. ఆమె వలన తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని తెలిపింది. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకునేదని.. తనను పెళ్లిచేసుకోవాలని వేధించేదని తెలిపింది. అలాగే ఈ విషయంలో జానీ మాస్టర్ నిర్దోషిగా బయటికి వస్తాడు అనే నమ్మకం నాకు వుంది. కోర్టు ప్రకటించేవరకు వెయిట్ చేయండి. అలాగే ఈ మధ్య చూస్తున్న న్యూస్ ఛానల్స్ జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నాడు అని వార్తలు చెప్పుకొస్తున్నాయి. ఆ వార్తలన్నీ అబద్దం, ఫేక్ వని ఆమె చెప్పింది. అతడు నేరం అంగీకరించలేదు అంటూ సుమలత చెప్పుకొచ్చింది.

