మహిళాదినోత్సవం నాడే వెలుగు చూసిన ఘోరం
మహిళపై అత్యాచారం జరిగిన ఘటన మహిళా దినోత్సవం ముందు రోజు వెలుగులోకి రావడం నిమ్మనపల్లె మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. సభ్య సమాజం తలదించునేలా జరిగిన ఘటనతో మహిళా లోకం భగ్గుమంది.ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గంలోని, నిమ్మనపల్లె మండలం, తవలం పంచాయతికి చెందిన 26 ఏళ్ళ మహిళ పాలు పోయడానికి గత నెల28 శుక్రవారం రాత్రి ఊరి సమీపానికి పాలకేంద్రానికి వెళ్ళింది. పాలు పోసి తిరిగి ఇంటికి వస్తుండగా దారి కాసిన నల్లమోళ్లపల్లెకు చెందిన నాగేంద్ర, సురేంద్ర లు బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి ఒకరు తరువాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారన్నరు. అనంతరం కొట్టి బావిలోకి తోస్తుండగా చంపద్దని బ్రతిమలాడి ప్రాణాలను దక్కించుకుని వెళ్లిపోయిందన్నారు. ఎవరికైనా చెబితే నీతో పాటు నీ భర్తను కూడా చంపు తామని బెదిరించడంతో భయపడి మిన్న కుండిపోయినట్లు బాధితురాలే తెలిపిందన్నారు. ఘటన సమాచారం తెలుసుకున్న ఎస్ఐ తిప్పేస్వామి శుక్రవారం గ్రామానికి చేరుకొని బాధితురాలని విచారించి ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.