Breaking NewscrimeHome Page SliderTelangana

దీక్షా దివ‌స్ నాడు జైలుకెళ్లి 15 ఏళ్లు

తెలంగాణా సాధ‌న పోరాట స‌మ‌యంలో నిర్వ‌హించిన దీక్షా దివ‌స్ నాడు త‌న‌ని ఆంధ్రా పోలీసులు ఆరెస్ట్ చేసి నేటికి స‌రిగ్గా 15 ఏళ్లు పూర్త‌వుతుంద‌ని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సంబంధిత విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న త‌న‌ని అప్ప‌ట్లో హ‌నుమ‌కొండ పోలీసులు అరెస్ట్ చేసి వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లించార‌ని గుర్తు చేశారు.ఉద్య‌మాలు,పోరాటాలు,దాడులు,అరెస్ట్ లు, వేధింపులు త‌మ‌కు కొత్తేమీ కాద‌న్నారు.ఎన్ని ప్ర‌భుత్వాలు ఏ ర‌కంగా హింసించినా పోరాటంతోనే హ‌క్కులు సాధించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.