కిషన్ రెడ్డిది నిజంగా తెలంగాణా డిఎన్ఏనా?
కేంద్ర సహాయశాఖా మంత్రి కిషన్ రెడ్డిది నిజంగా తెలంగాణా డిఎన్ఏనా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మాజీ సీఎం కేసిఆర్ ప్రోత్సాహంతో ఉన్నత పదవులు తెచ్చుకున్న కిషన్ రెడ్డి…ప్రధాన మంత్రి నరేంద్ర తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. ఎన్నికల వేళ తప్ప బీజెపి నాయకులకు తెలంగాణ ఎప్పటికీ గుర్తుకు రాదన్నారు.తెలంగాణ ఇచ్చింది,తెచ్చింది కాంగ్రెస్సే అని ఆయన మరో సారి గుర్తు చేశారు. మీడియా చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

