Home Page SliderNational

ఏసీల కోసం IIM అమృత్‌సర్ విద్యార్థుల వినూత్న నిరసన

దేశంలో ఎంతో ప్రతిష్ఠత్మకమైన మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో IIM అమృత్‌సర్ ఒకటి. అలాంటి విద్యాసంస్థలో ఏసీల కోసం విద్యార్థులు నిరసనకు దిగారు. కాగా ప్రస్తుతం అమృత్‌సర్‌లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు మెస్,క్లాస్‌రూమ్స్‌లోనే కాకుండా హాస్టల్‌లో కూడా ఏసీలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం విద్యార్థులంతా లైబ్రరీలోని టేబుల్స్‌పై పడుకొని వినూత్నంగా నిరసన తెలియజేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.