Breaking NewsHome Page SliderInternational

నేపాల్‌లో భారత్ బస్సుకు ఘోర ప్రమాదం..14 మంది మృతి

నేపాల్‌లో ప్రయాణిస్తున్న భారత్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నంబర్ ప్లేట్‌తో ఉన్న ట్రావెల్ బస్సుకు శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ బస్సులో 40 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 14మంది మరణించారు.  ఈ బస్సు నేపాల్‌లోని పొఖారా నుండి ఖాట్మాండూ వెళుతుండగా బస్సు మార్స్యాంగి  నదిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటన తనాహున్ జిల్లాలో జరిగింది. ఈ ప్రదేశం కొండల ప్రాంతం కావడం వల్ల సహాయక చర్యలు అంత సులువు కాలేదు. ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చెరుకుని 16 మందిని కాపాడగలిగారు. మరో 14 మృతదేహాలను గుర్తించారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి, సమాచారం తెలుసుకుంటోంది.