ఆయనంటే నాకు భయం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 16వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడిందంటే దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిబద్దత, క్షమశిక్షణ వల్లే సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోశయ్య మూడో వర్ధంతిని ఇవాళ హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2007లో తాను మొట్ట మొదటిసారి శాసన మండలిలో ప్రవేశించినప్పుడు సభలో రోశయ్య, చుక్కా రామయ్య లాంటి పెద్దవారిని చూస్తే.. ఒక లాంటి భయం ఉండేదన్నారు. మన మాటల్లో తప్పు, లేదా సమాచార లోపంతో వారి ముందు మనం తేలిపోతామేమోనని భయం ఉండేదన్నారు. తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని రోశయ్య 2007లో పలు కీలక సూచనలు చేశారని గుర్తు చేసుకున్నారు.

