Andhra PradeshHome Page Slider

ఏపీలో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ఫైట్ ఎలా ఉందంటే! (Exclusive)

ఏపీలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయ్. ఫలితాలను చెప్పడానికి అటు విశ్లేషకులు, మేధావులు కిందా మీదా పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో ఏం మాట్లాడితే ఏమవుతుంది. ఏం చెబితే ఏమవుతుందోనన్న మీమాంశ వారిని వెంటాడుతోంది. మొత్తంగా రాజకీయ విశ్లేషకులకు ఉత్కంఠభరిత వాతావరణాన్ని కలిగిస్తోంది. ఎన్నికలను విశ్లేషించడానికి ఒక మార్గం ఏమిటంటే, ముఖ్యమంత్రి వైఎస్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఏ మేరకు ప్రజలపై ప్రభావం చూపించాయన్నది తేలనుంది. మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వైసీపీ భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. అంతిమ ఫలితం వైసీపీపై ప్రజల విశ్వాసాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించేలా ఉండొచ్చు. లేదంటే టీడీపీ కూటమికి పగ్గాలు లభించనూవచ్చు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలకు కూడా తీర్పు కీలకంగా మారనుంది. దేశ వ్యాప్తంగా వస్తున్న సమాచారం మేరకు బీజేపీ కూటమి కీలక స్థానాలు అంటే 272 స్థానాలు మెజార్టీ మార్క్ చేరుకోనట్టయితే, ఏపీలో వచ్చే ప్రతి ఎంపీ స్థానం కీలకం కానుంది. జూన్ 4న ఓట్లను లెక్కించినప్పుడు, వివేకవంతమైన ఓటర్లు… ఎవరెని ఎన్నుకోనున్నారన్నది తేలనుంది. రాష్ట్రాన్ని పాలించడానికి ఒక పార్టీని, కేంద్రంలో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తీర్పిస్తారా అన్నది చూడాలి. రెండు సిద్ధాంతాలను బలపరిచే అనేక ఉదాహరణలను పరిశీలించవచ్చు.

హిస్టారికల్ ట్రెండ్
ప్రస్తుతం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ (టిడిపి)- జనసేన (జెఎస్‌పి) – భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒక వైపు, మరోవైపు కాంగ్రెస్‌లు ఉన్నాయి. ముఖ్యమంత్రి సోదరి షర్మిల ఈ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతారన్నది చూడాలి. నాలుగు దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం పెనుమార్పులకు గురైంది. ఎన్టీఆర్ స్థాపించిన ప్రాంతీయ పార్టీ టీడీపీ రాష్ట్రంలో కీలక పార్టీగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆంధ్రా ఓటర్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే పార్టీకి మద్దతుగా నిలిచారు. గత దశాబ్దంలో మరో ప్రాంతీయపార్టీ వైసీపీ రంగ ప్రవేశం చేయడంతో ఈ ధోరణి కొనసాగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలకు ఒకటిగా ఓటు వేసేవారు. 2014లో అవిభక్త రాష్ట్రంలో టీడీపీ 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకోగా, వైసీపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి అనుకూలంగానే వచ్చాయి. 2019లో జరిగిన తదుపరి ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలు, మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.

జగన్మోహన్ రెడ్డి సవాళ్లు
ఇప్పుడు తీర్పు భిన్నంగా ఉంటుందా? ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ఇక్కడ కూడా రకరకాల అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉన్న ఆదరణ చూసి ప్రజలు తనకు మళ్లీ ఓటు వేస్తారనే నమ్మకంతో జగన్మోహన్‌రెడ్డి ఉన్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత, నాయకులకు సమయమివ్వరని, ప్రజలతో గడపరని, పెండింగ్‌లో ఉన్న కేసులు ఆయనకు సవాళ్లను కలిగిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సోదరి షర్మిల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ వేడిని కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో, కాంగ్రెస్‌కు విధేయులుగా ఉన్న వారి ఓటు చీలిపోయే అవకాశం ఉంది. ఇలా జరగడం టీడీపీ నేతృత్వంలోని కూటమి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సహాయపడవచ్చు. ఆధిపత్య కమ్మ సామాజికవర్గం మద్దతు ఉన్న టీడీపీకి ఇప్పుడు ప్రభావవంతమైన కాపుల మద్దతు కూడా పొందుతోంది. నటుడు, రాజకీయ నాయకుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనను తాను ఈ వర్గానికి ప్రతినిధిగా భావిస్తారు. నటుడు కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా గుర్తింపుపొందారు.

చంద్రబాబు డూ-ఆర్-డై యుద్ధం
ఈ ఏప్రిల్‌లో 74 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబునాయుడుకు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ మనుగడకు సంబంధించిన అంశం అని తెలుసు. టీడీపీ ఆధిపత్యాన్ని పునరుద్ధరించడం, కుమారుడు నారా లోకేష్‌తో వారసత్వ ప్రణాళికతో ముందుకు సాగడం గతంలో కంటే చాలా కీలకం. సమర్ధుడైన నిర్వాహకునిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తాను అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అయితే సైబరాబాద్ అభివృద్ధి ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చాడన్న భావనతో ప్రజలు ఆయనకు ఓటేసినా వాస్తవంలో అది పూర్తిగా జరగలేదు. “సింగపూర్” లాగా కొత్త రాజధానిని నిర్మించాలనే తన గొప్ప ప్రణాళికను చంద్రబాబు నాయుడు చేయలేకపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రంలో కొత్త భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో కూడా సఖ్యత కొనసాగించలేకపోయారు. 1996 నుండి 2004 వరకు ఢిల్లీలో విపరీతమైన పలుకుబడితో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నాయకులలో ఒకరిగా ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు తన గత చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. ఆ పరిణామాలన్నీ ఆయనకు నిరాశను కలిగిస్తున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) నుండి వైదొలిగి, కాంగ్రెస్, ఇతరులతో కలిశాక, ఆపై మళ్లీ ఎన్‌డిఎలో చేరడం కోసం ఆయన ఎంతగానో కష్టించాల్సి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు నష్టపోయేది తక్కువే. యూపీఏ 2 సమయంలో రాష్ట్ర విభజన, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అంతర్గత ఆధిపత్య పోరు ఆంధ్రప్రదేశ్‌లో పాత పార్టీని కేవలం పాతాళానికి తీసుకెళ్లింది. కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు షర్మిలకు రాష్ట్ర శాఖ బాధ్యతలను అప్పగించి, ఏపీలో తిరిగి పుంజుకోడానికి ప్రయత్నిస్తోంది.