Breaking NewscrimeHome Page SliderNational

రన్యారావు కేసులో హోంమంత్రి..

కన్నడ నటి రన్యారావు అక్రమ బంగారం రవాణా కేసులో రాష్ట్ర రాజకీయాలకు షాక్ తగిలింది. రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర ఛైర్మన్‌గా ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలపై నేడు ఈడీ దాడులు జరిగాయి. ఈ కళాశాలకు, రన్యారావుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, అందుకే కళాశాల ఆర్థిక రికార్డులు పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఆమె వివాహానికి హాజరయిన రాజకీయ నేతలను, వారిచ్చిన కానుకలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహానికి సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి జి. పరమేశ్వర కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి కళాశాలపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దుబాయ్ నుండి 14 కిలోల బంగారు బిస్కట్లు తీసుకువస్తూ ఆమె పట్టుబడడంతో అరెస్టు చేశారు. ఆమెకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినా, కాఫిఫోసా చట్టం కింద నమోదైన కేసులో ఊరట దక్కకపోవడంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.