Home Page SliderInternationalNews AlertPoliticsviral

పాక్‌కు హై అలెర్ట్..

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై పలు ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధపడుతోంది. దీనిలో ముఖ్యమైనది సింధునది జలాల నిలిపివేత. ఈ కార్యాన్ని తక్షణమే అమలు చేసింది ప్రభుత్వం. జమ్ముకశ్మీర్‌లో చీనాబ్ నదిపై ఉన్నబాగ్లిహార్, ఇన్ సలాల్ డ్యాంలకు చెందిన గేట్లను 24 గంటల పాటు బంద్ చేసింది. ఈ నీటిని నిల్వచేసి, ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఈ డ్యామ్‌ల కింద పాక్ ఆక్రమిత కశ్మీర్, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఉన్న సియాల్‌కోట్, తదితర పట్టణాలకు పాక్ ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిక చేసింది. చీనాబ్ నదీ ప్రవాహం ఉద్ధృతమవుతుందని వార్నింగ్ ఇచ్చింది.