ఇల్లెందు బీఆర్ఎస్‌లో భగ్గుమన్న ఘర్షణలు
ఇల్లెందులో బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు పొడచూపాయి.
ఇల్లెందు గ్రామీణం: ఇల్లెందులో బీఆర్ఎస్ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు. విజయదశమి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ డీవీకి మధ్య వాగ్వాదం చెలరేగింది. వేదికపైకి ఆహ్వానం పలికే విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా తనకు ప్రాధాన్యం తగ్గించారంటూ డీవీపై రాజేందర్ కోపాన్ని ప్రదర్శించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎమ్మెల్యే ముందే జరిగిన ఘర్షణకు MLA సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు, కొంతసేపు వారిద్దరి మధ్య అరుపులు, కేకలు కొనసాగాయి. ఈ ఘటనతో కొద్దిసేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆగినాయి.

