రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు
హైదరాబాద్‌కు మరోసారి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కాగా రానున్న 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇవాళ,రేపు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కాగా ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. తెలంగాణా చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.