తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.రేపు,ఎల్లుండిలోగా అల్పపీడనం వాయుగుండా మారే అవకాశం ఉందని చెప్పింది.దక్షిణ కోస్తా,రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది.తెలంగాణలో ఖమ్మం,మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ప్రకటించింది. శ్రీలంక,తమిళనాడు తీరాల వైపు నెమ్మదిగా కదులుతున్న ఈ అల్పపీడనం తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.