మన్మోహన్‌తో టచ్‌లో ఉండేవాణ్ణి
గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తాను అప్పటి ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్‌తో టచ్‌లో ఉండేవాణ్ణని నేటి భారత ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తెలిపారు. మన్మోహన్ నివాసానికి చేరుకుని సందర్శన కోసం ఉంచిన ఆయన భౌతిక కాయం పేటిక చుట్టూ ప్రదక్షిణ చేసి మన్మోహన్ పాదాలు ఉన్న చోట తల,చేతులు ఆనించి నమస్కరించారు.అనంతరం ఆయన సతీమణి గురు చరణ్ కౌర్ కి శిరస్సు వంచి సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. గొప్ప ఆర్ధిక సంస్కర్తను దేశం కోల్పోయిందన్నారు. భవిష్యత్ పట్ల ముందు చూపు ఉన్న నాయకుణ్ణి దేశం కోల్పోయిందని ఉద్విగ్నంగా మాట్లాడారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అంటూ నిర్వేదం చెందారు.

