భార్యను ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడకబెట్టాడు
అనుమానంతో భార్యపై చేసుకోవడంతో దురదృష్టవశాత్తు చనిపోయింది.దాంతో భయపడిపోయిన భర్త శవాన్ని ఎలా మాయం చేయాలో తెలియక ముక్కలు ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడకబెట్టి చేపలకు ఆహారంగా వేశాడు.ఈ హత్యోదంతం విచారణలో వెలుగు చూసింది.మీర్ పేట్ లో నివాసం ఉంటే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తికి,మాధవికి 13 ఏళ్ల కిందట వివాహం అయ్యింది.ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ నెల 14న మాధవి,గురు మూర్తి గొడవ పడ్డారు.దీంతో తన మెడలోని తాళిని తీసి భర్త మోహాన విసిరేసింది మాధవి.దాంతో కోపంతో ఊగిపోయిన భర్త గురుమూర్తి…భార్యను గోడకేసి కొట్టాడు.దాంతో ప్రాణాలు విడిచింది మాధవి.విషయం బయటకు పొక్కితే పరువు పోతుందనే భయంతో శవాన్ని మాయం చేయాలన్న భయంతో భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడకబెట్టి సమీపంలోని చెరువులో చేపలకు వేశాడు.మాసం ముక్కలు మొత్తం చేపలు తినేదాకా వేచి చూసి ఇంటికి వచ్చాడు.ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి భార్య చనిపోయిందని నమ్మబలికాడు.అయితే బంధువుల ఫిర్యాదుతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు.