Home Page SliderTelangana

తెలంగాణాలో వేద పండితులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణాలో వృద్ధులైన వేద పండితులకు కేసీఆర్ సర్కార్ తీపికబురు అందించింది. కాగా ప్రభుత్వం వారికి ఇప్పటికే ప్రతి నెలా రూ.2500 గౌరవ భృతిని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గౌరవ భృతిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇకనుంచి వారికి రూ.5000 గౌరవ భృతి అందించనున్నారు. అంతేకాకుండా భృతి పొందే వేద పండితుల వయసును 75 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. దీంతోపాటు వేద పాఠశాలల నిర్వహణకు ప్రతి ఏటా రూ.2,00,000 రూపాయల గ్రాంట్ అందించేందుకు అనుమతించింది. దీనిపట్ల తెలంగాణాలోని వేద పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.