ఏపీ మాజీ సీఎం జగన్ కొత్త లుక్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్‌లో కనపడుతున్నారు. కాగా ఆయన కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వైఎస్ జగన్ గత వారం రోజులుగా బెంగుళూరులోని తన నివాసంలో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు జగన్‌ను కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోల్లో జగన్ వైట్ ఫైజమా,బ్లాక్ ప్యాంట్‌తో కనిపించారు. అయితే గతంలో ఎప్పుడు జగన్‌ను ఈ తరహ లుక్‌లో చూడలేదని వైసీపీ శ్రేణులు వెల్లడించాయి. దీంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో ఈ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.

