లండన్ వీధుల్లో ‘పుష్ప-2’ మేనియా..
పాన్ ఇండియా సినిమాగా డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న ‘పుష్ప-2’ చిత్రం ఇండియాలోనే కాదు విదేశాలలో కూడా పూనకాలు తెప్పిస్తోంది. పుష్పరాజ్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్‌కు విదేశీయులు కూడా ఫిదా అవుతున్నారు. లండన్ వీధుల్లో ఇండియన్ మూవీ ‘పుష్ప- 2’ కు డాన్స్ చేస్తూ కుర్రకారు ఉర్రూతలూగిపోయారు. ఈ వీడియోను మైత్రి మూవీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటికే అమెరికా, లండన్, జపాన్ వంటి చోట్ల భారీగా అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు బద్దలు కొట్టింది ఈ చిత్రం. కాగా నేడు హైదరాబాద్‌లో చివరి ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దీనికోసం యూసఫ్ గూడలోని ఈవెంట్ జరిగే పోలీస్ గ్రౌండ్స్‌లో ‘పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్షల సంఖ్యలో అభిమానులు హాజరవుతారని సమాచారం. అందుకోసం నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

