ఫ్లైఓవర్ పై వెళుతున్న కారులో మంటలు..
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు. అలా బయలు దేరి ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్ మీదుగా కారు వెళుతున్న సమయంలో కారులో నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన యువకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే కారులో నుండి దిగి నలుగురు యువకులు పరుగులు పెట్టారు. కారులో నుండి మంటలు రావడాన్ని గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు.

