రాజకీయాలకు ఇక దూరం..
రాజ్యసభ ఎంపి , వైసీపి కీలక నేత వేణుబాక్కం విజయసాయి రెడ్డి శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.తనకు ఇన్నాళ్లు అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబీకులకు అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా లకు కృతజ్క్షతలు తెలిపారు. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాని తెలిపారు.తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని,స్వేచ్చగా పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నానని పేర్కొన్నారు.చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవని,అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. ఏ రాజకీయ పార్టీల్లో చేరబోనని స్పష్టం చేశారు. కాగా విజయ సాయి రెడ్డి రెండు నెలల పాటు విదేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి కూడా కోరడం విశేషం.

