నగరంలో నకిలీ నోట్లు.. 5 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ లో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. ఎల్బీ నగర్ ప్రాంతంలో నకిలీ నోట్లను ముద్రిస్తున్న స్థావరాన్ని రాచకొండ పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై రెయిడ్ చేశారు. ఆ ఇంట్లో ఓ యువకుడు నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫేక్ కరెన్సీని రాత్రి సమయాల్లో చిన్న, చిన్న వ్యాపారుల వద్ద చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

